calender_icon.png 23 December, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని

23-12-2025 12:27:24 AM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): క్యాథలిక్ రెడ్డి అసోసియేషన్ ఫాతిమా నగర్ ఆధ్వర్యంలో ఎస్బిహెచ్ కాలనీ కిన్నర్ ల్యాండ్ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే క్రిస్మస్ పర్వదినం ప్రేమ, సోదర భావం, శాంతి సందేశాన్ని అందరికీ గుర్తు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో, పరస్పర గౌరవంతో జీవించాలన్నదే ఈ పండుగ సారాంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో 60వ డివిజన్ అధ్యక్షులు ఎనుకంటి పున్నం చందర్, క్యాథలిక్ రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు మత్యాస్ రెడ్డి, కార్యదర్శి ఇన్నారెడ్డి, అసోసియేషన్ సభ్యులు మేరీ, సుమ, ఎమ్మెస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.