calender_icon.png 23 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూల్చి ‘వెత’లే..!

23-12-2025 12:27:18 AM

ఉన్నఫలంగా అభివృద్ధి పనులు

పట్టణంలో మరమ్మతులకు ఇబ్బంది

మేడారంతో పనులకు బ్రేక్

దెబ్బతిన్న భగీరథ పైపులైన్లు

అస్తవ్యస్తంగా కేసముద్రం అభివృద్ధి

అడ్డదిడ్డగా తొలగింపులు

కేసముద్రం, డిసెంబర్ 22: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చం దంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ అభివృద్ధి మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసముద్రం పట్టణంలో ఆర్ అండ్ బి శాఖ ఉన్నఫలంగా నాలుగు ప్ర ధాన రహదారులను విస్తరించే పనులు చేపట్టడంతో కూల్చివేతలతో పట్టణ ప్రజలు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, జ్యోతిబా పూలే విగ్రహం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు , అలాగే బైపాస్ రోడ్డు విస్తరణ పనులన్నీ ఒకేసారి ప్రారంభించారు.

66 అడుగుల నుండి 80 అడుగుల మేర రోడ్లను విస్తరించి సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీ పనులు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. అలాగే బైపాస్ రోడ్డును 100 అ డుగులకు పైగా విస్తరించడానికి పనులు చేపట్టారు. ఈ పనులన్నీ పట్టణ నడి వీధుల్లో కొనసాగిస్తుండడం వల్ల గతంలో ఉన్న ఇరు కు రోడ్లను విస్తరించడం కోసం కూల్చివేతలు చేపట్టారు. ఒక్కసారిగా రోడ్లన్నీ విస్తరించే పనులు చేపట్టడంతో ఏండ్ల తరబడి ఉన్న వృక్షాలను పూర్తిగా తొలగించడం, వందల సంఖ్యలో షాపులు, ఇండ్ల నిర్మాణాలను కొంతమేర తొలగిస్తుండడంతో కేసముద్రం పట్టణం ప్రస్తుతం శిధిలాలతో కళా విహీనంగా మారింది. దీనికి తోడు షాపుల్లో కి వి నియోగదారులు రావడానికి రోడ్డు పనులు అడ్డంకిగా మారడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. నిత్యం దుబ్బ దూళితో ప్రధాన రహదారులు రాకపోకలకు ఇబ్బందిగా మారాయి.

ఒక్కసారిగా పట్టణంలో అన్ని రోడ్లు విస్తరిం చే పనులు చేపట్టడంతో గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు రోడ్డు పక్కనే వేయడం వల్ల అనేక చోట్ల పైపులు పగిలి తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలగడంతో పాటు మర మ్మత్తులకు ఆటంకం కలిగి రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. దీనికి తోడు రోడ్డు విస్తరణ కోసం తొలగించిన ఇండ్ల మ రమ్మతులను చేయడానికి భవన నిర్మాణ కా ర్మికులు, ఇతర పనివాళ్ళకు డిమాండ్ ఏర్ప డి చాలామంది మరమతు పనులు వెంట వెంటనే చేయించుకోలేకపోతున్నట్లు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గతంలో ఉన్న డ్రైనేజీ పూర్తిగా తొలగించడంతో ప్రస్తు తం ఇండ్ల నుంచి వెలువడుతున్న మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్గంధ భరితంగా మారింది.

పట్టణంలో ఎటు చూసి నా కూల్చివేసిన ఇండ్లు, భవనాలతో కేసముద్రం అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. ఇక పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు మేడా రం జాతర పనులు కూడా నిర్వహిస్తుండడంతో పలుచోట్ల పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. తారు వేయకుండా కంకర వేసి వదిలి వెళ్లడంతో వాహనాల రాకపోకల తో పాటు ప్రజలు కాలినడకకు కూడా కష్టంగా మారింది. బైపాస్ రోడ్డు ముందుగా 80 ఫీ ట్లు విస్తరించాలని భావించగా ఆ తర్వాత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించడంతో మళ్లీ ఆ పనులు మొదటికి వచ్చాయి. దీనితో బైపాస్ రోడ్డు పై రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది.

కేవలం జ్యోతిబా పూ లే విగ్రహం నుండి ఫ్లై ఓవర్ మీదుగా పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు మాత్రమే ఇరు వరుసల రహదారి పనులు పూర్తిచేసి, డ్రైనేజీ నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. రోడ్ల విస్తరణ కోసం మున్సిపాలిటీ, ఆర్ అండ్ బి శాఖ అధికారులు ముందుగా 80 అడుగు లు మార్కింగ్ ఇవ్వగా, ప్రస్తుతం ఆర్ అండ్ బి శాఖ 66 అడుగుల విస్తీర్ణంలో పనులు చేపట్టింది. అయితే పలు చోట్ల 30 అడుగుల నుంచి 45 అడుగులు మాత్రమే విస్తరించి పనులు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఒకరికి ఓ విధంగా మరొకరికి ఇంకో విధంగా విస్తరణ పనులు నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రోడ్డుపై ఉన్న వి ద్యుత్ లైన్లను తొలగించకుండానే రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారని, పద్ధతి ప్రకా రం కాకుండా రోడ్డు విస్తరణ పనులు ఇష్టరాజ్యంగా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

వేం కృషితో నగరంగా కేసముద్రం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమితులైన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, కేసముద్రం మండలానికి చెందిన వేం నరేందర్ రెడ్డి కృషితో మేజర్ పంచాయతీగా ఉన్న కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ సర్కిల్ కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పట్టణంలో రోడ్లన్నీ విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్స్, అగ్నిమాపక కేంద్రం, 132/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్, 30 పడకల ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి, షాదీ ఖానా, మినీ స్టేడియం ఇలా అన్ని విధాలుగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. 

అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను విడుదల చేయడంతో పాటు అనేక పనులు టెండర్లు పూర్తయి పనులు కూడా నిర్వహిస్తున్నారు. కేసము ద్రం పట్టణం ఎవరు ఊహించని విధంగా వేం నరేందర్ రెడ్డి కృషితో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.