14-11-2025 12:52:33 AM
కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ బొజ్జు పటేల్
ఖానాపూర్, నవంబర్ ౧3 (విజయక్రాంతి): ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమపథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు . గురువారం ఖానాపూర్ ఎంపీడీవో కార్యాల యంలో, ఖానాపూర్ నియోజకవర్గానికి సం బంధించి వివిధ అభివృద్ధి పనులు, పథకాల అమలుపై సంబంధిత అధికారులు అందరితో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్నిటిని అర్హులైన నిరుపేదలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు మార్గ నిర్దేశం చేస్తున్నట్లు వివరించారు.వివిధ శాఖల ఇంజనీరింగ్ ఏజెన్సీలో ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులు ఎప్పటిక ప్పుడు పూర్తి చేస్తూ ఉండాలని ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే గుత్తేదారును మార్చేందుకు వెనకడుగు వేయవద్దని పేర్కొన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, త్రాగునీరు, వంతెనలు, గృహాలు, విద్యుత్ అందించి, వారి జీవన ప్రమాణాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏ కారణాల చేతనైనా అభివృద్ధి పనులు ఆగితే, వెంటనే తమ దృష్టికి తేవాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిఎఫ్‌ఓ నాగినిభాను, ఆర్డిఓ రత్నకళ్యాణి, మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.