14-11-2025 12:51:58 AM
మల్కాజిగిరి, నవంబర్ 13(విజయక్రాంతి) : మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెవెన్ రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగులకు గురువారం పండ్లను పంపిణీ చేశారు. సెవెన్ రా ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ తిప్పారపు కీర్తి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కటకం మురళీధర్ హాజరై ఫౌండేషన్ సభ్యులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. సెవెన్ రా ఫౌండేషన్ చైర్మన్ కీర్తి కుమార్ హైకోర్టు అడ్వకేట్ అయి ఉండి చిన్న వయసులో సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. గతంలో విద్యార్థులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఎగ్జామ్ ప్యాడ్స్, స్టడీ మెటీరియల్స్ అందించడం లాంటి కార్యక్రమాలను చేయడం అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ సునీత, ఏవో డాక్టర్ సంగీత్ కుమార్‌లతోపాటు తిప్పారపు లక్ష్మణ్, కేశపాగ రామచందర్, సాత్విక్, సమైక్, చుంచు అశోక్, మనోహర్, యాతాకుల అశోక్, రామకృష్ణ, విజయరావు, ప్రణయ్, అంజి, ప్రభాకర్, సంతోష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.