calender_icon.png 18 August, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా కార్యాలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

17-08-2025 11:01:48 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ లో జరిగిన పలు వివాహాది కార్యక్రమాలకు హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొత్తపల్లి లో ఉన్న వెలిచాల ప్రజా కార్యాలయాన్ని ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్బంగా విప్ ఆది శ్రీనివాస్ కు వెలిచాల రాజేందర్ రావు స్వాగతం పలికారు. వారిని ఘనంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. వెలిచాల రాజేందర్ రావు ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ తో పలు అంశాలపై చర్చించారు. రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు.

ఈ మేరకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ యంత్రాంగాన్ని అన్ని విధాలా సమాయత్తం చేస్తున్నామని వేలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని, ఇందుకు ఒక ప్రత్యేక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నామని ఆది శ్రీనివాసకు రాజేందర్ రావు వివరించారు. కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని పేర్కొన్నారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలపై కూడా రాజేందర్ రావు చర్చించారు.