calender_icon.png 18 August, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చేనెల 9న చలో పరేడ్ గ్రౌండ్

18-08-2025 12:00:00 AM

వికలాంగుల,  చేయూత పెన్షన్ దారుల ‘మహా గర్జన‘

ముషీరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): సెప్టెంబర్ 9న చలో పరేడ్ గ్రౌండ్ వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహా గర్జన ను విజయవంతం చేయాలని ఎం ఎస్ పి రాష్ట్ర కో-ఆర్డినేటర్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి ఇంజం వెంకటస్వామి మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం డివిజన్ వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో రామ్ నగర్ డివిజన్ బాగ్లింగంపల్లి పాలమూరు బస్తీలో ఎంఎస్పి రాంనగర్ ఇన్చార్జి ముచ్చనపల్లి రాములు మాదిగ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం చేయుత పెన్షన్ దారులకు రూ. 2 వేల నుండి రూ. 4 వేల వరకు వికలాంగులకు రూ. 4 వేల నుండి 6వేల వరకు కండరాల క్షీణించిన వారికి రూ.15 వేలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న 45 లక్షల ఆసరా పింఛన్ దారులు ప్రభుత్వంపై తిరగు బాటు చేయడం తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు జంపాల మహేష్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల రాజశేఖర్ మాదిగ, ముషీరాబాద్ నియోజకవర్గం ఎంఎస్పి కో-ఆర్డినేటర్ అమ్ముగూడెం దశరథ్ మాదిగ, బండమీది నరసింహ రాజు మాదిగ, ఇల్లెందుల ఎల్లయ్య మాదిగ,  మల్లయ్య మాదిగ, నగేష్, అనంతమ్మ, యాదమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.