calender_icon.png 18 August, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

18-08-2025 12:00:00 AM

మాజీ ఎంపీ రవీందర్ నాయక్ 

ఖైరతాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : బంజారా లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేటగిరీలో కొనసాగుతున్నారని అన్ని రాష్ట్రాలలో బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మాజీ ఎంపీ రవీందర్ నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆది వారం ఇండియన్ ట్రైబల్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఫ్రంట్ అధ్యక్షులు జగన్ నాయక్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు..

గతంలో దేశానికి ప్రధాన మంత్రులు గా చేసిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ బంజా రాలను ఎస్సీ, ఎస్టీ, విజెఎన్ టీలుగా గుర్తించి బంజారాల అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. అలాగే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఎస్టి బంజారాలకు 10 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించాలని అన్నారు.

అలాగే ప్రస్తుత ప్రధాని మోడీ బంజారాల కాశీగా పేరుందిన మహారాష్ట్ర పౌర గడ్  యందు 700 కోట్లతో బంజారా నగారం మ్యూజి యం నిర్మించడం జరిగిందని తెలిపారు. ఎందుకు ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బంజారా విద్యార్థుల రీసెర్చ్ సమగ్ర అభివృద్ధి కోసం దేశ రాజధాని ఢిల్లీ, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో బంజారా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోనే పాత పార్లమెంట్ భవనానికి బంజారా భవన్ గా నామకరణం చేయాలని అన్నారు.