calender_icon.png 8 July, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

08-07-2025 12:33:30 AM

  1. జసమస్యల పరిష్కామే లక్ష్యంగా 28న ఇందిరా పార్కు వద్ద ధర్నా

జఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి పాపయ్య

ముషీరాబాద్, జులై 7 (విజయక్రాంతి):   మాదిగ, మాదిగ ఉపకులాల సమస్యల పరిష్కార సాధనే  లక్ష్యంగా జూలై 28న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి పాపయ్య వెల్లడించారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ర్ట ఎస్సీ బేడ(బుడగ) జంగాల జేఏసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ సదస్సు ఘనంగా నిర్వహించారు.

ముందుగా ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడి పాపయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన మాదిగ మాదిగ ఉప కులాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మాదిగ మాదిగ ఉప కులాలకు నామినేటెడ్ పదవులు కేటాయించడం లేదని, ఎస్సీ కార్పొరేషన్ నుండి లోన్స్ తీసుకున్న నిరుద్యోగలకు సబ్సిడీ నిధులు విడుదలలో జాప్యం జరుగుతుందన్నారు. కానీ మేఘ కృష్ణారెడ్డికి మాత్రం కాంట్రాక్ట్ బిల్లులు చెల్లిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ అయినా కూడా మాదిగ, మాదిగ ఉపకులాలు ఆ ఫలాలు పొందడం లేదన్నారు.

ప్రైవేట్ రంగాలలో కూడా వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ మాదిగ ఉప కులాలకు, అలాగే మాలలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు. తూర్పాటి హనుమంతు, నర్సింహా మేడి రమణ, మల్లేష్, జ్యోతి, వెంకటేష్, దాసరి సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.