calender_icon.png 8 July, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే బలాల

08-07-2025 12:32:08 AM

మలక్ పేట, జూలై 7 (విజయక్రాంతి): ఉత్సవాలను శాంతియుత వాతావరణం లో ప్రశాంతంగా జరుపుకోవాలని మలక్ పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని మలక్ పేట్ నియోజకవర్గం పరిధిలో ని 58  దేవాలయాలకు సంబంధించి 105 చె క్కులను దేవాలయ నిర్వాహకులకు ఎమ్మెల్యే బలాల అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే బలాల మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన నిధులను సద్వినియోగ పరుచుకొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మి,  కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి,  ఎంఐఎం నాయకులు సైఫుద్దీన్ షఫీ, దేవాదాయ శాఖ అధికారులు, దేవాలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.