calender_icon.png 5 August, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాల విద్యా సంరక్షణ ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలి

05-08-2025 06:54:06 PM

పాఠశాల విద్యారంగానికి నష్టం వాటిల్లితే ప్రభుత్వానిదే బాధ్యత

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, యూఎస్పిసి డిమాండ్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్య రంగాన్ని సంరక్షించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి యుఎస్పిసి ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట యుఎస్పిసి పోరాటం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

 యూఎస్ పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ బాధ్యులు టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ ధర్నా శిబిరాన్ని ప్రారంభిస్తూ ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యారంగం పట్ల ఉపాధ్యాయుల పట్ల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయకపోవడం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వైఖరిని ఖండిస్తున్నామని అనిల్ కుమార్ అన్నారు.

 2023 నాటికి పిఆర్ పిఆర్సి గడువు ముగిసిన పి ఆర్ సి కమిటీ రిపోర్ట్ అందించిన గడువు దాటి రెండు సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వం పిఆర్సి అమలుకు ముందుకు రాకపోవడం బాధ్యతరాహిత్యం అని అన్నారు. రిటైర్మెంట్ వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు.

 జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎన్ సి ప్రభాకర్, ఆకుల బాబు, లింగం లు మాట్లాడుతూ 317 జి ఓ వల్ల నష్టపోయిన వారికి స్థానికత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను ప్రభుత్వం పెంచి పోషించడాన్ని వ్యతిరేకిస్తున్నామని డి ఈ ఓ, డిప్యూటీ డిఇఓ, ఎంఈఓ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.