calender_icon.png 5 August, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్లాంటేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి

05-08-2025 06:58:12 PM

 జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్లాంటేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న చెట్లు తొలగింపు, పరిసరాల క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... యూనివర్సిటీ ఆవరణలో నిర్మించబోవు భవనాల, కంప్యూటర్ ల్యాబ్లు, తరగతి గదులు వాటికి అనుగుణంగా ప్రదేశాన్ని చదును చేయాలని సూచించారు. యూనివర్సిటీ ఆవరణలో ఖాళీ ప్రదేశంలో విస్తృతంగా ప్లాంటేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే పనస, టెకోమో, తెల్ల గన్నేరు, మందారం మొక్కలను విస్తృతంగా నాటాలని ఆదేశించారు. యూనివర్సిటీ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.