calender_icon.png 5 August, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహణ

05-08-2025 06:41:38 PM

కళాశాల ప్రిన్సిపల్, లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): పింగిళి మహిళా ప్రభుత్వ డిగ్రీ,  పీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) హనుమకొండ వడ్డేపల్లిలో మంగళవారం కళాశాల హెల్త్ క్లబ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వడ్డేపల్లి సంయుక్త ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్  ప్రొఫెసర్ బి. చంద్ర మౌళి  మాట్లాడుతూ... ఈ హెల్త్ క్యాంపులో నిర్వహించిన పదమూడు రకాల రక్త  పరీక్షలు విద్యార్థినిలకు ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి ఉపయోగ పడతాయని, వీటి ఫలితాలకు అనుగుణంగా తదుపరి చికిత్సను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు కొనసాగిస్తారని, ఈ హెల్త్ క్యాంప్ ద్వారా 140 మంది విద్యార్థినిలు, అధ్యాపకులు వివిధ రక్త పరీక్షలు చేయించకున్నారని అన్నారు.