13-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 21 మంది పదోతరగతి విద్యార్థులు.. ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించారు. వీరిలో హాసిని అనే విద్యార్థిని 574 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచింది.
వీరిని మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సన్మానించారు. పాఠశాల 97శాతం ఉత్తీర్ణతశాతాన్ని నమోదు చేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి, విద్యార్థుల పట్టుదల కారణంగా పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించగలిగిందని కొనియాడారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ పాల్గొన్నారు.