calender_icon.png 19 May, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్దురాలిపై దాడి చేసి రాబరీకి పాల్పడిన ముగ్గురు నిందితులు అరెస్ట్

19-05-2025 07:37:47 PM

నేరం జరిగిన 24 గంటలలో నిందితులను పట్టుకున్న పోలీసులు..

వీరి వద్ద నుండి (3) తులాల బంగారు ఛైను, నాలుగు రోల్డ్ గోల్డ్ గాజులు, హోండా యాక్టివా, మూడు సెల్ ఫోన్ స్వాధీనం..

వివరాలు వెల్లడించిన నల్లగొండ డిఎస్పీకే శివరామిరెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఇంట్లో ఒంటరిగా వున్న వృద్దురాలిపై దాడి చేసి రాబరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను నేరం జరిగిన 24 గంటల లోపే అరెస్టు చేసి వారి వద్ద నుండి (3) తులాల బంగారు ఛైను, (మూడు లక్షల విలువ) నాలుగు రోల్డ్ గోల్డ్ గాజులు, హోండా యాక్టివా, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కే శివరామిరెడ్డి(DSP K. Shivaram Reddy) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ నెల 17న నకిరేకల్ పట్టణంలోని వి‌టి కాలనీలో ఉంటున్న నాగులవంచ లక్ష్మమ్మ  వృద్దురాలిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఒంటరిగా వున్నా ఆమెను కట్టేసి, చేతులతో కొట్టి గాయపరచి ఒంటి మీద ఉన్న మూడు తులాల పుస్తెల త్రాడును, నాలుగు రోల్డ్ గోల్డ్ గాజులను దొంగలించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనలు మేరకు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి  పర్యవేక్షణలో నకిరేకల్ సి.ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సై  బి.లచ్చిరెడ్డి, శాలిగౌరారం ఎస్సై  డి.సైదులు, తిప్పర్తి ఎస్సై బి.సాయి ప్రశాంత్ లు మూడు ప్రత్యేక బృందాలతో వేర్వేరు ప్రదేశాలలో నేరస్తుల కొరకు తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా ఈనెల 18న తిప్పర్తి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఒక హోండా యాక్టివా మోటార్ సైకిల్ పైన వెళుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా, అనుమానం కలిగి, వెంటపడి పట్టుకొని తనిఖీ చేయగా వారి దగ్గర ఒక పుస్తెల త్రాడు దొరికింది. తదుపరి విచారణలో సదరు వ్యక్తులు ఈ నెల 17న  వి.టి. కాలని, నకరేకల్ లో ఒక వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి కిరాయికి ఏమైనా రూమ్ ఖాళీగా ఉన్నాయా అని అని అడుగగా, ఖాళీ లేదని చెప్పడంతో, త్రాగడానికి నీళ్ళు కావాలని అడుగగా, సదరు వృద్ధురాలు నీళ్ళు తీసుకొని రావడానికి లోనికి వెళ్ళిన సమయంలో, ఆమె ఇంటిలోనికి జొరబడి, ఆమెను ఒక దుప్పటిని చింపి దానితో, ఆమె మూతిని, కాళ్ళు, చేతులు కట్టివేసి, చేతులతో ఆమె మొఖంపైన పిడి గుద్దులు గుద్ది, ఆమె ఒంటి పైన వున్నాఒక బంగారం చైను, చేతికి వున్నా గాజులు (రోల్డ్ గోల్డ్) గుంజుకొని పారిపోయినట్లు తెలిపారు. కేసును చేదించిన ఎస్సైలను సిబ్బందిని పోలీసులు అభినందించారు.