26-08-2025 02:46:09 AM
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాం తి): భారత్ సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లోని ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ధోతీలు, చీరలు, టీ-షర్టులు, దుప్పట్లను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంపిణీ చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గార్డెన్ మాలీలు, హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అంకితభావంతో సేవలు అందిస్తున్న కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.
ఆశ్రమం నిస్వార్థ సేవలను గవర్నర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్, భారత్ సేవాశ్రమ సంఘం ప్రతినిధి స్వామి వెంకటేశ్వరానంద మహరాజ్, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు.