calender_icon.png 26 August, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూకు వెళ్లేందుకు ఇనుప కంచెల రక్షణా?

26-08-2025 02:45:39 AM

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఓ యూ వెళ్లే మా ర్గంలో లా కాలేజీ నుంచి ఆడిటోరియం వరకు 12 అడుగుల ఎత్తయిన ఇనుప కంచెలు వేసి, పోలీసు పహారా మధ్య నడుమ సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వెళ్లారని, ఆయనకు అంత భయం ఎందుకని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీ అని చెబుతున్న రేవంత్‌రెడ్డి, అదే యూనివర్సిటీలో విద్యార్థులు తనను ఉరికించారని చెప్పుకుంటే బాగుండేదని ఎద్దేవాచేశారు.

సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తుపాకీ ఎక్కుపెట్టి ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై దాడి చేసిన చరిత్ర తనదని చెప్తే బాగుండేదన్నారు. అందుకే రేవంత్‌రెడ్డికి ఓయూ విద్యార్థులు ‘తుపాకీ రెడ్డి’ అని కొత్త బిరుదు ఇచ్చారని తెలిపారు. అసలు యూనివర్సిటీకి ఎందుకు వెళ్లాడో సీఎం రేవంత్ రెడ్డికే కాదు, విద్యార్థులకు కూడా తెలియడం లేదన్నారు.