31-10-2025 10:06:14 PM
 
							జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
కాటారం,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కాటారం మండలంలోని ధన్వాడ, శంకరంపల్లి, రేగుల గూడెం గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆమె పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను తీసుకొని నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అన్ని విధాలుగా తోడ్పడుతుందన్నారు.