calender_icon.png 11 May, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి

10-05-2025 11:57:47 PM

సారంగాపూర్,(విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసి పోయి నాణ్యతను కోల్పోయే అవకాశం ఉందని, తద్వారా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పలు గ్రామాల్లో అధికారులు నాయకులు కలిసి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా, ధాన్యం కొనుగోలు మాత్రం ఇంకా ఆరంభం కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు వాతావరణం పట్ల ఎలాంటి నష్టం వాటిల్లకన్న ముందే ప్రభుత్వం సరైన సమయంలో తగిన ఏర్పాట్లు చేసి అలసత్వం చూపకుండా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి , ధాన్యం కొనుగోలు మరింత వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.