11-05-2025 12:00:47 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష- 2025 కు ఏర్పాట్లు పూర్తి, ఆరు పరీక్ష కేంద్రాలలో 13.05.2025(మంగళవారం) జరుగుతుదని , 2009 మంది అభ్యర్థులు పరీక్ష ప్రవేశ పరీక్ష రాస్తున్నారని జిల్లా కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కామారెడ్డి డాక్టర్ కే విజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుంది అభ్యర్థులని ఉదయం 10 గంటల నుంచి ప్రవేశ కేంద్రాల్లోకి అనుమతిస్తారు .11 గంటల తర్వాత వచ్చిన వారికి ఒక నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదని తెలిపారు. కాబట్టి విద్యార్థులందరూ సమయానికి వచ్చి పరీక్షలు రాయాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన సూచనలను అభ్యర్థులకుఇవ్వ నైనది.
1. అభ్యర్థులు తమ వెంట ఒక ఎస్ బి పెన్సిల్, బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్, మరియు హాల్ టికెట్ తీసుకొని రావాల్సిందిగా కోరారు.
2. పరీక్ష కేంద్రంలోకి వాచ్ లు, మొబైల్ ఫోన్లు, పర్సులు, షూలు ,మరియు ఎలక్ట్రానిక్ పరికరాలని అనుమతించమని కావున అభ్యర్థులు వాటిని తీసుకొని రాకూడదని సూచించారు.
4. హాల్ టికెట్ పై ఫొటోస్ స్పష్టంగా లేని అభ్యర్థులు గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా తమ ఫోటోని ధృవీకరణ చేయించుకుని రావలసిందిగా సూచించారు.