19-11-2025 12:41:29 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, నవంబర్ 18 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించే ఐకేపి, పిఏసిఎస్, మెప్మా, ఎఫ్‌పిఓ లకు చెందిన అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించిన వెంటనే బిల్లులను పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో సమర్పిం చాలన్నారు. అప్పుడే వేగవంతంగా రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ కే సీతారామారావు, డిఎస్‌ఓ మోహన్‌బాబు, డిఎం రాము, డిసిఓ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.