19-11-2025 12:42:16 AM
ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి
చేగుంట, నవంబర్ 18 :యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని మండలంలో పూర్తిగా అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు 2020 నుంచి నషాముక్త్ భారత్ అభియాన్ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్‌ఐ 2 బిక్య నాయక్, ఏఎస్‌ఐ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.