calender_icon.png 25 May, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలి

24-05-2025 12:52:49 AM

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ 

కామారెడ్డి టౌన్, మే23(విజయ్ క్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వి.విక్టర్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియల్, కామారెడ్డి మండలంలోని సరంపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఈరోజు సందర్శించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా, అకాల వర్షాల కారణంగా రైతుల పండించిన ధాన్యం కేంద్రాల్లోనే తడిసి పోతున్నదని, వరి పంట తడిసి పోకుండా ముందస్తుగా తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించాలని ధాన్యం కేంద్రం ఇన్చార్జీలను ఆయన ఆదేశించారు.

అకాల వర్షాలకు దాన్యం తడిసి పోకుండా టార్ఫాలిన్ లను వరి పంటపై కప్పి ఉంచాలని తెలిపారు. వీలైనంత తొందరగా వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించి రైతులకు నష్టపోకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఆయన వెంట సంబంధిత తహసిల్దార్లు లు, మరియు ధాన్యం కేంద్రాల ఇన్చార్జీలు ఉన్నారు.