calender_icon.png 23 May, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలి

23-05-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మందమర్రి, మే 22 (విజయక్రాంతి): ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న అకాల వర్షాల పరిస్థితులలో కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని తక్షణమే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట, సారంగపల్లిలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, గుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ సతీష్‌తో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ నేపథ్యంలో నెలకొన్న అకాల వర్షాల పరిస్థితుల కారణంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయిం చిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.

సన్న రకం వడ్లు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల అదనపు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నిర్దేశిక లక్ష్యాన్ని పూర్తి చేసిన కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వారికి కేటాయించిన లక్ష్యాల ను త్వరగా పూర్తి చేసే విధంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. 

అనంతరం మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులతో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాంతాలకు త్రాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.