23-05-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మే 22 (విజయక్రాంతి): ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో దీర్ఘకాలింగాకంగా పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వె స్టిగేషన్ కేసులను వీలైనంత త్వరగా సరైన సమయంలో, సరైన దర్యాప్తును నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ దర్యాప్తును పూర్తిచేసి ప్రజలకు న్యాయం చేకూరాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ అన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.
ఒక్కో సర్కిల్ కార్యాలయ అధికారితో ప్రత్యేకంగా విడివిడిగా ఒక్కొక్క కేసుపై క్షుణ్ణంగా కేసు దర్యాప్తు, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో మూడు పట్టణ పోలీస్ స్టేషన్ లు, మూడు సర్కిల్ కార్యాలయాలు, మొత్తం 12 పోలీస్ స్టేషన్లో పరిధిలో దాదాపు 300 కేసులను సాధ్యమైనంత వరకు పక్కా ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.
బాధితులకు సరైన న్యాయం అనగా నేరస్తులకు శిక్షలు పడడమే అని తెలియజేశారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కేసులలో ఎంసి రిపోర్టులు, పీఎంఈ రిపోర్ట్లు, ఎంవిఐ రిపోర్టులు, ఫైర్ అధికారి కార్యాలయంలో ఉన్న పెండింగ్ రిపోర్టులు, అగ్రికల్చర్ కార్యాలయంలో ఉన్న రిపోర్టులు లాంటి చిన్నచిన్న వాటిని త్వరగా సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా ఎక్సైజ్ కేసులో వారం రోజుల లోపు స్వాధీ నం చేసుకున్న వాటిని ఫారెన్సీక్ లాబరేటరీ కి పంపాలని సూచించారు. 41 A నోటీసుల ను వీలైనంతవరకు పూర్తిచేసి కేసు నమోదు అయిన వారికి అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని పెండింగ్లో ఉన్న కేసులను పూర్తి చేయాలని సూచించారు.
రైటర్ లు, కోర్టు డ్యూటీ అధికారులు జవాబుదారితనం అలవర్చుకోవాలని సూచించారు. కేసుల పూర్తి లో ఎలాంటి తప్పులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, సీఐ లు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, ఫణిదర్, వెంకటేశ్వర రావు, స్వామి, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.