04-09-2025 09:26:02 PM
వడ్డేపల్లి (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలో పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(Pingle Government Women's College) కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్ట్ నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి అధ్యక్షతన గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్నిగురు పూజోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రపంచంలోని అన్ని వృత్తుల్లోకెల్లా అత్యుత్తమమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. జి.సుహాసిని, ఐ క్యూ ఏ సి కో ఆర్డినేటర్ డా. డి.సురేష్ బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. ఎం.అరుణ టీచర్స్ డే ప్రాధాన్యతపై ప్రసంగించారు. తదనంతరం కళాశాలలోని అధ్యాపకులను పుష్పగుచ్ఛం, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పి.డి సుజాత, మధు, డా.సారంగపాణి, డా. యుగంధర్, డా.సామ్యూల్ ప్రవీణ్ కుమార్,డా.కె. శ్రీనివాస్, డా. పి.పద్మ,కవిత, డా.రేణుక, డా.మాధవి, డా.లకన్ సింగ్, డా.ప్రశాంతి, జ్యోతి, ఉదయశ్రీ, రాంరెడ్డి, రమేష్ వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.