17-01-2026 02:31:58 AM
తాండూరు, 16 జనవరి, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాం గ్రామంలో శుక్రవారం గ్రామ దేవతకు ఘనంగా పూజలు నిర్వహించారు. మహిళలు భారీగా తరలివచ్చి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
పోతురాజుల విన్యాసాలు.. శివశక్తుల పూనకాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను తిలకించేందుకు గ్రామానికి వచ్చిన బంధువులు, శ్రేయోభిలాషుల తో పండగ వాతావరణం నెలకొంది.