13-09-2025 05:02:24 PM
మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా వాసి వేముల అశోక్ కు గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు రావడం అభినందనీయమని, షార్ట్ ఫిలిమ్స్ కు పాటలు రాసి తన ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న అశోక్ ను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు శనివారం శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీపీసీ ఇండియా) వివిధ రంగాలలో కృషి చేసిన వారికి ఈ నెల 19న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు అందుకోబోతున్న సందర్భంగా బీసీల ముద్దుబిడ్డ వేముల అశోక్ కి బీసీ సమాజం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, గజ్జెల్లి ఎంకన్న, చెలిమెల అంజన్న, అంకం సతీష్, ఆరెంధుల రాజేశం, అఫ్రోజ్, నేరటి శంకరన్న, సత్యనారాయణ, ప్రభు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.