calender_icon.png 11 September, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదకలకు కార్పోరేట్ వైద్యం అందించేందుకు కృషి

06-12-2024 12:11:51 AM

సంగారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కార్పోరేట్ వైద్య ం అందించేందుకు సర్కార్ దవాఖానలో  మౌళిక సదుపాయలు కలిపిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో మహిళ సంఘలకు చెక్కులు పంపిణి చేసి, ఆందోల్‌లో నర్సింగ్ కళాశాల, వంద పడుకల దవాఖాన, 50 పడుకల మాత శిశు దవాఖాన భవనాలు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆందోల్ ప్రజలకు ఆత్యాధునిక వైద్యం అందించేందుకు కొత్తగా  50 పడుకల మాత, శిశు దవాఖాన, నర్సింగ్ కళాశాల భవనాలు నిర్మాణం చేస్తున్నామన్నారు.

60 సీట్లతో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. కొత్త భవనాలు నిర్మాణం చేసి ఏడాదిలో వైద్య సేవలు ప్రారంభిస్తామన్నారు. వంద పడుకల దవాఖానలో రోగులకు అన్ని రకాల వైద్యం అందించేందుకు స్పెషాలిటి వైద్య సేవలు, ఎక్విప్‌మెంట్ అందుబాటులోకి తీసుకవస్తామన్నారు. గర్భిణిలు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి పోవాలసిన పని లేదన్నారు. ఆందోల్ ఎంసీహెచ్‌లోనే మహిళలకు, శిశువులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారన్నారు. నర్సింగ్ కళాశాలకు భవనం లేకపోవడంతో 60 సీట్లతో ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త భవనంలో తరగతులు నిర్వహిస్తామన్నారు. కొత్తగా కళాశాల, దవాఖాన ఏర్పాటు చేయడంతో ఎంతో మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించిందన్నారు.

ఏడాది కాలంలో ఆందోల్ నియోజకవర్గంలో రూ.600 కోట్ల నిధులతో అభివృద్ది చేశామన్నారు. నియోజకవర్గంను అన్ని రంగాల్లో ముందుకు తీసుకపోతామన్నారు. అభివృద్ది, సంక్షేమంలో ముందుకు తీసుకపోయి, ప్రజల రుణం తీసుకుంటానన్నారు. వంద పడుకల దవాఖాన భవనం నిర్మాణం చేసి రోగులకు కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందిస్తామన్నారు. ప్రభుత్వం అన్ని వర్గల సంక్షేమం కోసం అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్, కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య విధాన పరిషత్ కమీషనర్ అజయ్‌కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, జోగిపేట మున్సిపాల్ చైర్మన్ గూడెం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

మహిళ సంఘలకు రూ. 650.20 కోట్లల చెక్కులు 

మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ది సాధించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీల ద్వారా రూ. 650.20 కోట్లు రుణాలు మంజూరు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో మహిళ శక్తి క్యాంటీన్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రారంభించారు. మహిళ శక్తి పథకంలో రాష్ట్రంలో అభివృద్ది లక్ష్యాం ప్రభుత్వం పని చేస్తుందన్నారు.మహిళలను కోటేశ్వర్లులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలను అన్ని రంగాల్లో మందుకు తీసుకపోవడం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి వల్లూరు,  అదనపు కలెక్టరులు  చంద్రశేఖర్, మాధూరి, పీడీ జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.