calender_icon.png 4 November, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కార్యాలయం ముందు మొలకెత్తిన ధాన్యం

04-11-2025 01:51:46 AM

  1. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతుల ధర్నా 
  2. వ్యవసాయ శాఖ అధికారుల పనితీరుపై విమర్శలు

నంగునూరు, నవంబర్ 3: అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు చూపుతున్న అలసత్వంపై నంగునూరు రైతులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం తహసిల్దా ర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద మొలకెత్తిన ధాన్యం పోసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేస్తూ తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. స్థానిక వివేకానంద చౌరస్తా వద్ద గల ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

తహసిల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు ధర్నా విరమించబోమని బైఠాయించారు. ’సీఎం డౌన్ డౌన్, కలెక్టర్ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. అధికారుల నిర్లక్ష్యం న శించాలీ, తడిసిన ధాన్యాన్ని కొనాలి అంటూ రైతులు డిమాండ్ చేశారు. ధాన్యంలో 17 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాల్సి ఉం డగా, 15-16 శాతం తేమ ఉన్న వడ్లను కూడా కొనడానికి నిరాకరిస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారని తీవ్ర ఆ రోపణలు చేశారు. కొనుగోలు కేంద్రాల ని ర్వాహకులు సరిగా పనిచేయడం లేదని, సరైన సమయానికి గన్ని బ్యాగులు అందించడం లేదని వాపోయారు. సమయానికి ధాన్యం సేకరిస్తే రైతులకు ఇంత కష్టం వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ అధికారులపై విమర్శలు

వ్యవసాయాధికారి, గ్రామాల్లో ఏఈఓలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని రైతులు వాపోయారు. పంట నష్టం వివరాలు సరిగా సేకరించడం లేదని, సర్వే చేయకుండా ప్రభు త్వం నష్ట పరిహారం ఎవరికి ఇస్తుందని ప్రశ్నించారు. రైతు వేదికల్లో కనీస సౌకర్యాలు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఏఓను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

హుస్నాబాద్‌లో...

హుస్నాబాద్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తుంటే నంగునూరు మండలంలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు నిలదీశారు. హుస్నాబాద్ లో మం త్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాబట్టే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కొనడం ?అని ప్రశ్నించారు. తహసిల్దార్ మాధవి, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ వివేక్ రైతుల ధర్నా వద్దకు చేరుకుని రైతులను సముదాయించారు. 

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఏవో విధుల్లో సక్రమం గా పనిచేయడం లేదని, వెంటనే సస్పెండ్ చేయాలని రైతులు తమ సమస్యలను వివరిస్తూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన డీసీఓ వరలక్ష్మీ, తహసిల్దార్ మాధవిలకు వినతి పత్రం అందజేశారు.