calender_icon.png 9 May, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసరి ముద్ర ఆనవాళ్లు కనుమరుగు!

09-05-2025 01:36:51 AM

వట వృక్షాల తొలగింపుతో బోసిపోతున్న కేసముద్రం

మహబూబాబాద్, మే 8 (విజయ క్రాంతి): ఒకప్పుడు దట్టమైన ‘మాను’లతో నిండి సింహాలు (కేసరి) సంచరించడం వల్ల వాటి ‘అడుగుల’ జాడలు అధికంగా కనిపించడంతో కేసరి ముద్ర గా పిలవబడుతూ.. క్రమక్రమంగా కేసముద్రంగా మారిన గ్రామంలో ఇప్పుడు పెద్ద ‘వట’ వృక్షాలన్నీ తొలగిస్తుండడంతో నాటి ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రాన్ని ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో పట్టణ ప్రధాన రహదారి అంబేద్కర్ సెంటర్ నుండి కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీనితో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఏళ్ల కాలం నాటి వట వృక్షాలను ఆర్ అండ్ బి శాఖ తొలగిస్తోంది. రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను సమూలంగా తొలగిస్తున్నారు.

రోడ్ల వెంట ఉన్న చెట్లన్నీ తొలగిస్తుండడంతో కేసముద్రం పట్టణం ప్రస్తుతం బోసిపోతోంది. రోడ్డు విస్తరణ పూర్తి చేసిన తరువాత రోడ్డుకి ఇరువైపులా, లేదంటే రోడ్డు మధ్యలో మొక్కలు నాటి చెట్లుగా ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.