29-09-2025 12:53:57 AM
సనత్‌నగర్, సెప్టెంబర్ 28 (విజయక్రాం తి):- చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేవీ శరన్నవరాత్రులు, విజయదశమి జరుపుకుంటామని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేవీ నవరాత్రులలో భాగంగా ఆదివారం ఆయన పలు దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
సనత్ నగర్ డివిజన్‌లోని సెవెన్ టెంపుల్స్, అమీర్‌పేట డివిజన్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, కనకదుర్గమ్మ ఆలయం, గణేష్ ఆలయాలను, బేగంపేటలోని కట్ట మైసమ్మ అమ్మవారిని, రాం గోపాల్ పేట డివిజన్‌లోని ప్రముఖ దేవాలయం శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవా రిని బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద గల ఆటోస్టాండ్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని, పద్మారావునగర్‌లోని పోల్ బాల్ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుని పూజలలో పాల్గొన్నారు.
ఆలయ పండితులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, టి. మహేశ్వరి, మాజీ కార్పొరేటర్‌ర్లు నామన శేషుకుమారి,అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, ఆలయ ఈవోలు సత్యనారాయణ, శేఖర్, అంబుజ, నరేందర్ రెడ్డి, సుభాష్, మనోహర్ రెడ్డి, బల్కంపేట ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, బిఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు తదితరులు ఉన్నారు.