calender_icon.png 9 July, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ భేటీ

14-08-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 13: రేట్లను హేతుబద్దీకరించేందుకు సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు కౌన్సిల్ మంగ ళవారం సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ పోస్టులో తెలిపింది. వస్తు సేవల సన్ను రేట్ల హేతుబద్దీకరణ, పన్ను శ్లాబ్స్ తగ్గింపు, డ్యూటీ ఇన్వెర్షన్ తొలగింపు తదితర అంశాలను కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ చర్చిస్తుంది.