23-09-2025 01:42:34 AM
కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. సోమవారం బొల్లారం వార్డు 8లోని గంగపుత్ర సంఘం కార్యాలయం నుంచి కార్గిల్ వార్ రామచంద్ర స్టా ట్యూ వరకు స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ రూ.97 లక్షలతో సిమెంట్ రహదారి నిర్మాణ పనులను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికా ర్జున్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అ నంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రోడ్డు ఏళ్ళనుంచి నిర్లక్ష్యానికి గురైందని, స్టేట్ గవర్న మెంట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ 97 లక్షల రూపాయలతో చేపడుతున్న ఈ రహదారి నిర్మాణం వల్ల ఈ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వే ణుగోపాల్‌రెడ్డి, కదిర్వన్, బాలరాజు, రామ్, శ్రీనివాస్, ప్రేమ్, హయత్, శరత్ పాల్గొన్నారు.