25-10-2025 12:07:34 AM
మిల్జిల్: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై శివ నాగేశ్వర నాయుడు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పోశయ్య (56) తన పశువులను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఇండియన్ పెట్రోల్ పంప్ దగ్గర జడ్చర్ల కల్వకుర్తి ప్రధాన రహదారిపై కారు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోచయ్యను 108 లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.పోచయ్య అల్లుడు కావలి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.