14-07-2025 09:58:27 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ స్థానిక మద్నూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం లీగల్ సర్వీసెస్ కరపత్రాలను ఎస్సై విజయ్ కొండ(SI Vijay Konda) కమ్యూనిటీ మీడియేటర్లు సురేష్ ఉడతావార్, మోరి అశోక్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలు, సీనియర్ సిటిజన్ తగాదాలు, ఇతర చిన్న చిన్న సమస్యలను పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగకుండా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. మద్నూర్ గ్రామపంచాయతీ ఆవరణలో గల కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో వాలంటీర్లు సురేష్ ఉడుతవార్, మోరే అశోక్ కుమార్ ను సంప్రదించి ఇరువురు కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. న్యాయ సహాయం కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఉచిత న్యాయ సలహాలు కోరవచ్చు అని చెప్పారు .