calender_icon.png 6 December, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్‌పై ఘనంగా గుమ్మడి నర్సయ్య సినీ ప్రారంభోత్సవం

06-12-2025 06:57:55 PM

పెద్దమ్మ తల్లి దీవెనలు అందుకున్న రీల్ స్టార్, రియల్ స్టార్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బూర్గంపాడు,(విజయక్రాంతి): ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్ గుమ్మడి నర్సయ్య సినీ పూజా కార్యక్రమం హెచ్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమo చిత్ర కథానాయకుడు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, గుమ్మడి నర్సయ్యలు చేతుల మీదగా అంబేద్కర్ కు పూలమాల వేశారు. అనంతరం పట్టణ ప్రజల మధ్యలో భారీ ర్యాలీతో పెద్దమ్మ తల్లి గుడి చేరారు. నల్ల సురేష్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. హెచ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గుమ్మడి నరసయ్య సినీ పూజా కార్యక్రమంలో కథానాయకుడు శివరాజ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్మాత నల్ల సురేష్ రెడ్డి, దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే, గుమ్మడి నరసయ్య, సంగీత దర్శకులు, సినీ ప్రముఖులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాత నల్ల సురేష్ రెడ్డి  మాట్లాడుతూ మా బ్యానర్ పై నిర్మించబడుతున్న తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, మంచి కథతో, గొప్ప నటీనటులతో గుమ్మడి నరసయ్య ప్రజల మనిషిగా, ఇప్పటికి  ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటారని ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి సన్నివేశంలో ముఖ్యఅతిథిగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సతీమణి గీత క్లాప్ కొట్టగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

సినీ షూటింగ్ షెడ్యూలు త్వరలో ప్రకటిస్తామని పాల్వంచ కిన్నెరసాని, ములుగు పలు ప్రాంతాల్లో ప్రారంభం కానున్నదన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గుమ్మడి నరసయ్య కుమార్తె అనురాధ,  సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, ఎన్ఎస్ఆర్ ఆర్గనైజర్స్ పాల్గొన్నారు .వెంకట్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సందుబట్ల శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ యుగేందర్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.