calender_icon.png 28 September, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్-1బీ ఫీజు పెంపు ఐటీకి దెబ్బే

26-09-2025 01:14:25 AM

  1. క్రెడిట్ రేటింగ్ తగ్గే అవకాశం
  2. బ్రిక్‌వర్క్ రేటింగ్స్

ముంబై, సెప్టెంబర్ 25: ఇటీవల అగ్రరాజ్యం అమెరికా హెచ్-1బీ వీ సా ఫీజులను భారీ గా పెంచేసింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే వీసా ఫీజులను ఒకేసారి లక్ష అమెరికన్ డాలర్లకు పెంచుతున్న ట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అధ్యక్షుడి తాజా నిర్ణయంతో భారతీయ ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. హెచ్-1బీ వీసా లు పొందుతున్న వారిలో భారతీయులే 71 శాతం ఉండడం గమనార్హం.

భారతీయ ఐటీ రంగంలో ప్రస్తుతం ఏడాదికి 283 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. తాజా పరిణామంతో ఈ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది. వీసా ఫీజుల పెంపుతో ఐటీ పరిశ్రమ క్రెడిట్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. భారతీయ ఐటీ రంగానికి సమకూరే ఆదాయంలో దాదాపు 57 శాతం అమెరికా నుంచే లభిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ ఆదాయం భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా భారతీయ ఐటీ సర్వీస్ ప్రొవైడర్లపై ఫీజు పెంపు ప్రభావం ఉండనుంది.