26-09-2025 12:00:00 AM
‘దిల్ తో బచ్చా హై... హర్ దిన్ నయీ కహానీ లిఖ్తా హై’ చిత్రాన్ని ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యం లో ఈ నెల 29న జరగనున్న ప్రపంచ హృ దయ దినోత్సవం సందర్భంగా ఓ హృదయాన్ని హత్తుకునే అవగాహన చిత్రాన్ని విడుదల చేసింది. దిల్ తో బచ్చా హై, హర్ దిన్ నయీ కహానీ లిఖ్తా హై అనే శీర్షికతో తీసిన ఈ చిత్రంలో, మన హృదయం ఒక చిన్నారి లాంటి అమాయకత్వం, ఆనందం కలిగిన కళ్ళతో కనిపిస్తుంది.
గుండె ఆరోగ్యం అంటే ఏమిటి, దాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది కొత్త కోణంలో చూపిస్తూ ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ఈ కథలో తార అనే యువ ప్రొఫెషనల్ నిరంతరం గడువులు, ఒంటరితనం, ఒత్తిడితో జీవిస్తుంది. అలాంటి సమయంలో ఆమెకు తన హృదయాన్ని ప్రతిబింబించేలా ఒక చిలిపి, తెలివైన ‘హృదయ‘ ఎదురవుతుంది. హృదయ ఆమె బిజీ లైఫ్లోకి అడు గుపెట్టి, తొందరపాటు అలవాట్లను అడ్డుకుంటుంది.
తప్పుడు ఆహారపు అలవాట్లను ఎగతాళి చేస్తూ, ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని గుర్తుచేస్తుంది. ‘స్వీయ సంరక్షణ లేకుండా కష్టపడి పనిచేయడం అసంపూర్ణం‘ అనే నిజాన్ని తారకు తెలియజేస్తుంది. ఈ అవగాహన చిత్రం కేర్ హాస్పిటల్స్ అధికారిక యూ ట్యూబ్ ఛానెల్‌తో పాటు సోషల్ మీడియా పేజీల్లో ప్రీమియర్గా ప్రసారం కానుం ది.
ఈ కార్యక్రమం గురించి, కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్ మాట్లా డుతూ.. ‘కేర్ హాస్పిటల్స్లో మేము గుండెను కేవలం ఒక అవయవంగా కాదు, భావోద్వేగాలను నడిపించే దిక్సూచిగా భావిస్తా ము. ఈ చిత్రం నేటి ఉద్యోగుల కష్టాలను చూపిస్తుం ది. మన హృదయాన్ని వినడం - ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి మొదటి అడుగు అని ఇది గుర్తు చేస్తుంది‘ అని అన్నారు.