calender_icon.png 12 October, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైళ్ళు నిలుపుదల చేయాలని కోరుతూ మంత్రికి వినతి

11-10-2025 06:38:58 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణ రైల్వే స్టేషన్ లో పలు రైళ్ళకు హాల్టింగ్ సౌకర్యం కల్పించి ప్రయాణికులకు మెరుగైన రవాణ సౌకర్యం కల్పించాలని లెదర్ పార్కు సాధన చర్మకార ఉత్పత్తి దారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొలుగూరి విజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం పట్టణ పర్యటనకు వచ్చిన రాష్ట్ర కార్మిక గనులు ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందచేసి మాట్లాడారు. పట్టణ రైల్వే స్టేషన్లో రామగిరి, సింగరే ణి, కాగజ్ నగర్ -సికింద్రాబాద్ మధ్య నడిచే కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు పట్టణ రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ కల్పించాలని కోరారు.

పట్టణంలో రైళ్ల హాల్టింగ్ లేకపోవడం వల్ల ప్రజలు బెల్లంపల్లి, మంచిర్యాలకు వెళ్లి ప్రయాణం చేస్తూ ఆర్థికంగా నష్టపోతు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పట్టణం లోని మార్కెట్ ఆర్టీసీ బస్టాండ్ కు అన్ని బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి వయా బి జోన్ మీదుగా మందమర్రి మార్కెట్ కు, మార్కెట్ నుండి సండ్రోన్ పల్లి, సారంగపల్లి, ఆదిల్ పేట్, పొన్నారం, గుడిపల్లి వెంకటాపూర్ ల మీదుగా కాన్కూర్ వరకు తిరిగి మందమర్రి మార్కెట్ కు వచ్చి బి జోన్ మీదుగా మంచిర్యాల చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలని, అంతే కాకుండా మందమర్రి మార్కెట్, సారంగ పల్లి, ఆదిల్ పేట, జెండా వెంకటాపూర్, శ్రావణ్ పల్లి, మామిడిగట్టు, అవడం వరకు ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు.

బస్సు సౌకర్యం కల్పించడం మూలంగా గ్రామీణులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడమే కాక ఆర్థిక భారం తప్పుతుంద న్నారు. పట్టణంలోని లెదర్ ఇండస్ట్రీస్ పార్క్ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసి బిల్డింగ్ మరమ్మతులు చేపట్టి రంగులు వేయించాలని,నూతన బిల్డింగ్ నిర్మాణం చేయించాలని, హైదరాబాద్ గచ్చిబౌలి హెడ్ ఆఫీస్ లో బూట్లు కుట్టే వందల మిషన్లు వృధాగా పడి ఉన్నాయని అక్కడి 40 మిషన్లు పట్టణంలోని లెదర్ పార్క్ లో ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 400 మందికి ఉపాధి దొరుకుతుందని ఈ దిశగా చర్యలు తీసుకోవాల న్నారు. స్కూల్ బూట్లు, లేడీస్ బ్యాగ్స్, పర్సులు, బెల్టులు, స్కూల్ బ్యాగ్స్ తయారు చేయడంతో పాటు ప్రభుత్వ స్కూల్లకు అవసరమైన వస్తువులు ఆర్డర్ ఇప్పించడం ద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని కోరారు. వీటి పై సానుకూలంగా సంధించిన మంత్రి వివేక్ పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.