calender_icon.png 12 October, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరిమల మహా పాదయాత్ర ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

11-10-2025 06:37:56 PM

గూడెం మధుసూదన్ రెడ్డి..

అమీన్ పూర్: భక్తి, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక సాధనలో అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో ప్రాముఖ్యమైనదని సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీకి చెందిన దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 24వ తేదీన బిహెచ్ఇఎల్ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి శబరిమల దేవస్థానం వరకు చేపట్టనున్న మహా పాదయాత్రల ఆహ్వాన పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, పెద్ద రాజు, వెంకటేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పాదయాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.