calender_icon.png 14 October, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కార్యసిద్ధి హనుమాన్ ఆలయ వార్షికోత్సవం

14-10-2025 12:33:06 AM

స్వామివారికి మన్యుసూక్తాభిషేకాలు,  గణపతి మన్యు సూక్త హోమం 

గజ్వేల్, అక్టోబర్ 13: గజ్వేల్ పాండవుల చెరువు కట్టపై శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

వేద పండితులు చాడ నంద బాల శర్మ వైదిక నిర్వహణలో ప్రధాన అర్చకులు విఠాల సాయికృష్ణ శర్మ, వేద పండితులు చంద్రశేఖర శర్మ, గోపి శర్మ , శరత్ శర్మ వేద బ్రాహ్మణులచే గణపతి పూజ,  స్వస్తివాచనము, దేవత ఆహ్వానం,  ఆంజనేయస్వామికి మన్యు సూక్త అభిషేకాలు, గణపతి, ఆంజనేయ మూల మంత్ర,  మన్యుసూక్త హోమం ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుంటక బిక్షపతి, మామిడి రాములు, దుబగుంట రుక్మయ్య, నర్సింగరావు, జనార్దన్ రెడ్డి,  సుధాకర్ రెడ్డి, అయిల వేణు, నేత నాగరాజు, గంగిశెట్టి కృష్ణ  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.