calender_icon.png 9 August, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1,200 కోట్ల రెడ్కో టెండర్ల నిలిపివేత!

09-08-2025 03:15:53 AM

  1. టీఎస్‌ఈఏ విజ్ఞప్తిని పరిశీలించాలని కోర్టు ఆదేశం
  2. రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి
  3. అప్పటి వరకు టెండర్లను ఖరారు చేయవద్దు

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీఎస్‌ఈఏ) చేసిన విజ్ఞప్తిని రెండు వారాల్లో పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని, అప్పటివరకు టెండర్లన ఖరారు చే యవద్దని రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీఎస్‌ఈఏ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీహరిబాబు, ఉపాధ్యక్షుడు రాజేశ్ పరకాల, సంయుక్త కా ర్యదర్శి బాబునాయుడులు విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు.

అయితే రెడ్కో నుంచిగాని, ప్రభుత్వం నుంచిగాని ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ అభ్యంతరాలను తెలుపుతూ అసోసియేషన్ రెండు పిటి షన్లను రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసింది. 

రెండు వారాల్లో పరిష్కరించాలి

ఎల్1, ఎల్2 బిడ్డర్లకు కలిపి రెండు క్లస్టర్లను కేటాయించడంపై అభ్యంతరం తెలుపు తూ.. మొదట పేర్కొన్నట్టుగా ఒక క్లస్టర్‌కు ఒక బిడ్డర్ అనే నిబంధనను తుంగలో తొక్కడమేనని, తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ల అభ్యర్థనలను పరిశీలించి, ప్రతివాదులైన రెడ్కో, ఇం ధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ తదితరుల వాదనలనుకూడా కోర్టు విన్నది.

టెండరు నిబంధనలు అసమానతతో, న్యాయవిరుద్ధంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19(1) (జి)కి విరుద్ధంగా ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించి, అసోసియే షన్ ఇచ్చిన విజ్ఞప్తిని రెండు వారాల్లో పరిష్కరించాలని బుధవారం ఉత్తర్వులు జారీచేసిం ది. అంతవరకు టెండర్లును ఖరారు చేయవద్దని కూడా ఆదేశాల్లో స్పష్టంగా హైకోర్టు పేర్కొంది.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో సోలార్ రంగ అభివృద్ధికి అవసరమైన పోటీ వాతావరణం ఉండాలని, చిన్న, మధ్యస్థాయి సంస్థలకు న్యాయం జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్, కుసుం ద్వారా ప్రతి రైతుకు, ప్రతి గృహానికి లబ్ధి చేకూరాలంటూ.. సమాన అవకాశాలను ఉండాలని అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై హర్షం వ్యక్తంచేశారు.

టెండర్లపై టీఎస్‌ఈఏ అభ్యంతరం

రాష్ట్రంలో పీఎం సూర్యగర్భ్ మోడ ల్ గ్రామాలుగా ఎంపిక చేసిన గ్రామాల్లోని ఇండ్లపై (రూఫ్‌టాప్) 2 కిలోవాట్ల చొప్పున సౌర విద్యుత్తు ఫలకాల ఏర్పా టు, అలాగే పీఎం కుసుమ్ సి(ఐపీఎస్) స్కీములో భాగంగా రైతుల పొలాలు, చేన్లలో 7.5 కిలోవాట్ గ్రౌండ్ మౌంటె డ్ సౌర వ్యవస్థల ఏర్పాటు కోసం తెలంగాణ రెడ్కో జూలై 4, 2025 నాడు సుమారు రూ. 1,200 కోట్ల విలువైన టెండర్లను పిలిచింది.

అయితే ఒకే క్లస్టర్‌లో అనేక గ్రామాలను కలిపి, ప్రతి క్లస్టర్‌కు కేవలం రెండు బిడ్డర్లను మాత్రమే ఎంపిక చేయడం, ఆర్థికపరమైన అర్హతలను కేవలం లీడ్ బిడ్డర్‌కు మాత్రమే వర్తింపచేయడం, కన్సార్టియం సభ్యులను పక్కన పెట్టడంపై తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీఎస్‌ఈఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీనిపై రెడ్కోకు, డిప్యూటీ సీఎం భట్టికి అసోసియేషన్ తరఫున విజ్ఞప్తులను అందించారు. తమకు సౌర వ్యవస్థలను ఏర్పాటుచేసే అవకాశాన్ని కల్పించాలని, టెండర్లలో పేర్కొన్న అర్హతాంశాలు అన్నీ బడా సంస్థలకు, అదికూడా పక్క రాష్ట్రాల్లోని కంపెనీలకు అవకాశం కల్పించేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.