calender_icon.png 13 August, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్ ఘర్ తిరంగా యాత్ర

13-08-2025 12:00:00 AM

వేములవాడ టౌన్ ఆగస్టు 12 (విజయక్రాంతి): పట్టణ బిజెపి అధ్యక్షుడు రాపల్లి శ్రీ ధర్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల బస్టాండ్ ప్రాంతం నుండి తి ప్పాపూర్ బస్టాండ్ వరకు జాతీయ జెండా లు పట్టుకొని బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం పట్టణంలోని సుభాష్ నగర్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సం దర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ మాట్లాడుతూ.. ఎందరో మహానీయుల త్యా గాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్ర భారత దేశంలో జీవిస్తున్నామని, ప్రతి భారతీయుడు జాతీయ జెండాను రేపటినుండి మూడు రోజులు గౌరవంగా ఇంటిపై ఎగురవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రేగుల మల్లికా ర్జున్, సంటి మహేష్ చందనం రవి కృష్ణ స్వామి రేగుల శ్రీకాంత్ నేరెళ్ల సాయి వివేక్ , యశ్వంత్, మనీష్ ,రాజశేఖర్, బిల్లా క్రిష్ణ, బచ్చు వంశీ, నరసయ్య, పిన్నింటి హనుమా న్లు తదితరులుపాల్గొన్నారు.