calender_icon.png 13 August, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయంలో మొక్కలు నాటిన సమాచార శాఖ కమిషనర్లు

13-08-2025 05:51:51 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవనంలో బుధవారం రాష్ట్ర ప్రధాన సమాచార హక్కు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి(Commissioner Chandrashekhar Reddy) కమిషనర్లు పర్వీజ్ భూమేష్(Commissioner Parvez Bhumesh)లు తెలంగాణ హరితవనంలో భాగంగా మొక్కలు నాటి నీళ్ళు పోశారు. హరితవనాల ఏర్పాటుతో పర్యావరణం పరిరక్షించబడుతుందని మొక్కలు నాటి పెంచవలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, బైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి, అధికారులు ఉన్నారు.