13-08-2025 05:54:48 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ బుట్టాయిగూడెం గ్రామ యూత్ అధ్యక్షులు జాడి రాజాబాబు తండ్రి అయిన జాడి అంకులు ఇటీవలే ఆనారోగ్య కారణంతో మృతి చెందారు. బుధవారం రోజు దశదిన కర్మలకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సహకారంతో 17వేల రూపాయిలను బీఆర్ఎస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ధిక సహాయం అందించారు. బీఆర్ఎస్ పార్టీ రాజబాబు కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.