calender_icon.png 27 October, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసీస్ క్రికెటర్లకు వేధింపులు

26-10-2025 12:00:00 AM

నిందితుడు అరెస్ట్

ఇండోర్, అక్టోబర్ 25 : ప్రపంచకప్ ఆడుతున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్‌లో ఓ ఆకతాయి ఇద్దరు ఆసీస్ క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాము బస చేసిన హోటల్ దగ్గరలో ఒక కేఫేకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వారి ముందు అసభ్యకరమైన చేష్టలు చేయడంతో పాటు వారి చేయి పట్టుకుని లాగాడు.

తర్వాత కొద్దిదూరం వెంబడించడంతో  షాక్‌కు గురైన ఇద్దరు మహిళా క్రికెటర్లు తమ మేనేజర్‌కు ఫోన్ చేశారు. తర్వాత మేనేజర్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఖజ్న్రాకు చెందిన అకీల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా ఖండించింది.