calender_icon.png 27 October, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాను బెంబేలెత్తిస్తారా ?

26-10-2025 12:00:00 AM

నేడు భారత్ చివరి లీగ్ మ్యాచ్

నవీ ముంబై, అక్టోబర్ 25 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ చివరి లీగ్ మ్యా చ్‌కు సిద్ధమైంది. సెమీఫైనల్‌కు ముందు బం గ్లాదేశ్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న భా రత మహిళల జట్టు కొన్ని అంశాల్లో మెరుగుపడాల్సి ఉంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్‌తో పాటు దీప్తి శర్మ ఫామ్ లో ఉండడం అడ్వాంటేజ్.

అయితే బౌలింగ్‌లో మాత్రం స్నేహారాణా, అమన్‌జోత్ భా రీగా పరుగులిచ్చేస్తున్నారు. లీగ్ స్టేజ్‌లో వరుసగా 3 మ్యాచ్‌లలో ఓటమికి డెత్ ఓవర్స్‌లో పేలవ బౌలింగే కారణం. దీంతో స్లాగ్ ఓవర్స్‌లో ప్రత్యర్థిని కట్టడి చేయడంపై మరిం త ఫోకస్ పెట్టాలి. మరోవైపు గ్రౌండ్ ఫీల్డింగ్ బాగున్నా, క్యాచ్‌లు అందుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు.

క్యాచ్‌లపై కూడా మరింతగా దృష్టి పెట్టేందుకు బంగ్లాతో మ్యా చ్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎం దుకంటే సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియాతో తల పడబోతోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న కంగారూలను నిలువరించాలంటే అన్ని విభాగాల్లోనూ భారత్ వందశాతం రాణించాలి. అందుకే బంగ్లాతో మ్యాచ్‌ను దీనికి ఉపయోగించుకోవాలని భావిస్తోంది.