26-10-2025 12:00:00 AM
టైటిల్ పోరులో ముంబై, బెంగళూరు ఢీ
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : మూడు వారాలుగా అభిమా నుల ను అలరిస్తున్న ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్ చివరి అంకానికి చేరింది. ఆదివారం గచ్చిబౌలీ ఇండోర్ స్టేడి యం వేదికగా ఫైనల్ జరగబోతోంది. ముం బై మీటియర్స్, బెంగళూరు టార్బెడోస్ టైటిల్ పోరులో తలపడబోతున్నాయి.లీగ్ స్టేజ్‌లో ముంబై మీటియర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
7 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 17 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ముంబై జట్టుకు ఇదే తొలి ఫైనల్. మరోవైపు బెంగళూరు టార్పెడోస్ కూడా బలంగానే ఉంది. లీగ్ స్టేజ్‌లో ఆ జట్టు 7 మ్యాచ్‌లలో 5 గెలిచి 14 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచింది. మొత్తం మీద రెండు టాప్ టీమ్స్ మధ్య జరిగే టైటిల్ పోరు హోరాహోరీ సాగుతుందని అంచనా వేస్తున్నారు.