calender_icon.png 31 August, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినన విష్ణు

30-08-2025 05:14:14 PM

మందమర్రి,(విజయక్రాంతి): హైదరాబాదులో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పట్టణానికి చెందిన పేగంబరం విష్ణు నాలుగు పథకాలను సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విష్ణును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ  మాట్లాడుతూ... జాతీయ స్థాయి ఐసిఎన్ బిల్డింగ్ కేటగిరీలలో జీకే ఫిట్నెస్ హబ్ యూని సెక్స్ జిమ్ శిక్షకుడు విష్ణు నాలుగు పథకాలను సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు. యువత ఫిట్నెస్ పై దృష్టి సారించి భవిష్యత్తును బంగారు మయం తీర్చిదిద్దుకోవాలని కోరారు. అనంతరం పథకాల విజేత విష్ణు మాట్లాడుతూ పట్టణం లోని జీకే ఫిట్నెస్ హబ్ యూని సెక్స్ జిమ్ వలననే ఫిట్నెస్ సాధించి బాడీ బిల్డింగ్ లో పథకాలు సాధించా నన్నారు.