calender_icon.png 30 August, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ లిస్ట్ పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి

30-08-2025 04:44:56 PM

అనంతగిరి: మండలంలోని అన్ని గ్రామ గ్రామపంచాయతీలో ఓటరు ముసాయిదా జాబితాను ప్రదర్శించామని ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని అనంతగిరి తహసిల్దార్ హిమబిందు(Tehsildar Himabindu) సూచించారు. గ్రామపంచాయతీ ఓటరు జాబితా పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో హరి సింగ్ ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలంలో 20 గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డుల వారిగా ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం విడుదల చేశామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, వివిధ గ్రామాల నాయకులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, నల్ల భూపాల్ రెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, బుర్ర పుల్లారెడ్డి, బానోతు బాబు నాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, ఈదుల కృష్ణయ్య, ముత్తినేని కోటేశ్వరరావు, పి వీరయ్య వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు